పుట:GodavarisimaJanapadaKalaluKridaluVedukalu.djvu/214

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

ఓలితక్కువని గుడ్డిదాన్ని పెళ్ళిచేసుకుంటే నెలకి ముప్పయికుండలు
                                       పగలగొట్టిందట.
కుంచడొడ్లు కూలికెళితే తూముడొడ్లు దూడలుతినేశాయట.
కుక్కమొరిగితే జంగంపరపతి పొతుందా?
కర్రలేనివాణ్ణి గొర్రెకరఛిందన్నట్టు
కలిహానిపెట్టినా ఉట్టివంకే చూసినట్టు
కలిచొచ్చేవేళకి నడిచొచ్చే బిడ్దపుడతాడని
కాకిపిల్ల కాకికి ముద్ధు
కాకిముక్కుకు దొండపండు లాగ
కాకుల్నికొట్టి గెద్దలకేసినట్టు
కాలుజారితే తీసుకోగలం గానీ, నొరుజారితే తీసుకొలేం
కాలుపట్టుకుతోసేస్తే చూరుపట్టుకు వేళ్ళాడుతున్నట్టు
కాశీకెళ్ళి గాదిదగుడ్డు తెచ్చినట్టు
కుక్కకాటుకు చెప్పుదెబ్బ
కుక్క తోకపట్టుకుని గోదారీదినట్టు
కూలికొచ్చి పాలికి మాటాడినట్టు
కూసేగాడిదొచ్చి మేసేగాడిదని చెరిపిందట
కాలికేస్తే మెడకీ, మెడకేస్తే కాలికీ
కొండకి వెంట్రుక్కీ ముడేయడం
కొత్తబిచ్చగాడు పొద్దెరగడన్నట్టు
కొత్తవింత, పాతరోత
కొబ్బరిచెట్టేందుకెక్కావంటే దూడ గడ్డికోసమన్నాడట
కొరివితో తలగోక్కున్నట్టు
కోడలికి బుద్ధిచెప్పి అత్తరంకోయిందట
కామమ్మ మొగుడంటే కాబోసనుకున్నాను - కాకపోతే నాకర్రా, బుర్రా
                      ఇలాపారెయ్యండి పోతానన్నాడట
కోతికి కొబ్బరికాయదొరికినట్టు
కూచోడానికి చోటిస్తే తొంగోడానికి చోటిమ్మన్నాడట
కూడారావొద్దంటే ఎత్తుకోమని ఏడ్చిందట