పుట:GodavarisimaJanapadaKalaluKridaluVedukalu.djvu/213

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

ఎగరభోయి బోర్లాపడి ఊరచ్చురాలేదన్నట్టు
ఎద్దుపుందు కాకికి ముద్దా !
ఎరువుసొమ్ము బరువు చేటు
ఎలకలమీదకొపంతొ ఇల్లుతగలెట్టుకున్నట్టు
ఎవడికిపుట్టినబిడ్డరా వెక్కివెక్కిఏడుస్తావని
ఎవళ్ళుతీసుకున్నగోతిలో వాళ్ళేపడతారు
ఎక్కడవేసినగొంగళి అక్కడే
ఎవరికంపు వారికింపు
ఎవళ్ళపిచ్చి వాళ్ళకానందం
ఏపుట్టలో ఏపాముందో
ఏరుదాటి తెప్ప తగలేసే రకం
ఏచెట్టూలేనిచోట ఆముదంచెట్టే మహావృక్షం అన్నట్టు
ఏమొగుడూలేకుంటే అప్పమొగుడే దిక్కని
ఏరుదాటిందాకా ఏరుమల్లయ్య ఏరుదాటాక బొడిమల్లయ్య
హేమాహేమీలు యేట్లోకొట్టుకుపోతుంటే నక్క పాటిరేవడిగిందట
ఏకాయైతేనేం పళ్ళూడగొట్టుకోవడానికి ?
ఏకైవచ్చి మేకై తగులుకున్నట్టు
ఏకర్రకునిప్పుంటే ఆకర్రే కాలుతుంది
ఏదుమనువులెల్లినా యేకులొడకటం తప్పలేదట
ఏడ్చేదానికిమొగుడొస్తే ఏకులొడికేదానికీ మొగుడొస్తాడని
ఎనుగునుచూసి కుక్కలు మొరిగినట్టు
ఏనుగు బ్రతికినావెయ్యే, చచ్చినావెయ్యే
ఏబ్రాసికి పనెక్కువ లోభికి ఖర్చెక్కువ
ఏగూటిచిలక ఆగూటిపలుకే పలుకుతుంది

ఒకనాడా దొరికింది, ఇక మూడునాడాలూ గుర్రం దొరకడమేతరువాయి
                                అన్నాడట.
ఒకరిద్దరినిచంపితేగాని వైధ్యుడుకాడు
ఒకఊరికాపు ఇంకౌఊరికి మాల.
ఒకదెబ్బకి రెండుపిట్టలు
ఓడలు బళ్ళవుతాయి, బళ్ళు ఓడలవుతాయి
ఓడినొదు వీధిలోఏడిస్తే, నెగ్గినోడు ఇంట్లోఏడ్చాడట