పుట:GodavarisimaJanapadaKalaluKridaluVedukalu.djvu/211

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

అన్నం ఉడికిందోలేదో మెతుకుబట్టిచూస్తే చాలు
అనుమానం పెనుభూతం
అప్పుచేసి పప్పుకూ'దు
అప్పులున్నవాదివెంట చెప్పులున్నవాడివెంట పోగూడరు
అక్కాచెల్లిళ్లకన్నంపెట్టి లెక్క వ్రాసుకున్నట్టు
అందానికినేను రాగానికిమాఅన్న అందట

ఆర్నెల్లు సావాసంచేస్తే వరువీరవుతారు
ఆర్నెల్లు సాముచేసి మూలనున్న ముసలమ్మను పొడిచాడట
ఆలికి అన్నంపెట్టడం ఊరికి ఉపకారం
ఆలూలేదూ చూలూలేదూ కొడుకుపేరు సోమలింగం
ఆవుచేలో మేస్తే దూడ గట్టున మేస్తుందా?
ఆయనే ఉంటే మంగలెందుకూ అని
ఆవులిస్తే పేగులు లెక్కపెట్టేరకం
ఆడది తిరిగి చెడుతుంది మగవాడు తిరక్కచేడతాడు
ఆకలి రుచి ఎరుగదు, నిద్ర సుఖమెరుగదు
ఆఊరికి ఈఊరెంరో ఈఊరికి ఆఊరూఅంతే
ఆదిలోనే హంసపాదు
ఆ అంటే అపరాధం, ఊ అంటే ఉపరాధం (ఉపద్రవం)
ఆకులునాకేవాడింటికి మూతులునాకేవాడొచ్చాడట
ఆడబోయినతీర్ధం ఎదురైనట్టు
ఆరాను లోదే ఈముక్కకూడా
ఆడలేక మద్దెల ఓడన్నట్టు

ఇంటిగుట్టు లంకకుచేటు
ఇంటికిఏబ్రాసి పొరుక్కి శివాలక్ష్మి
ఇంటిదొంగని ఈశ్వరుడుకూడా పట్టలేడు
ఇల్లలగ్గానే పండగవుతుందా ?
ఇల్లు ఇరకాటం, ఆలి మర్కటం
ఇంతలావున్నావు తేలు మంత్రంరాదా అని
ఇంటివాడు గొడ్డుగేదంటే పొరుగువాడు పాడిగేదంటాడా ?
ఇంటిపేరుకస్తూరివారు, ఇల్లంతాగబ్బిలాల కంపు