పుట:GodavarisimaJanapadaKalaluKridaluVedukalu.djvu/210

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

అంబలి తాగేవాడికి మీసాలెత్తేవాడొకడు
అచ్చిపెళ్లి బుచ్చిచావు కొచ్చింది
అడగందే అమ్మైనా పెట్టదు.
అడుసు త్రొక్కనేల కాలుకడగనేల
అత్తచచ్చినఆరుమాసాలకి అల్లుడు పరామర్శకొచ్చినట్టు
అడిగేవాడికి చెప్పేవాడు లోకువ
అంత్య నిష్టూరంకన్న ఆదినిష్టూరం మేలు
అచ్చమ్మ పెళ్లిలో బుచ్చమ్మశోభనాలని
అలివోణ్ణి బలివొడు కొడితే బలివోణ్ణి బెమ్మదేవుడు కొట్టాడట
అసలే కోతి, అందులోకల్లుతాగించి, ఆపైన తేలుకుట్టింది
అయ్యెచ్చేదాకా అమావాస్య ఆగుతుందా /
అరచేతి బెల్లం చిరుచేదు
అన్నీ తెలిసినొడికి అమావాస్య మరణం, ఏమీఎరగ్నోడికి ఏకాదశి
                           మరణం
అడావిడిపెళ్ళికొడుకు తోడగుడ్డెదాన్ని తీసుకుపోయేడట
అణాకాణీపెళ్ళికి అర్ధరూపాయి బాణాసంచా
అదిగోవులంటే ఇదిగో తోకన్నట్టు
అదృష్టవంతుణ్ణీ పాడుచేసేవాడూలేడు, దురదృష్టవంతుణ్ణి బాగుచేసేవాడూ
                                        లేడు
అమ్మవారిమొక్కూ తీరుతుంది, ఆసాదోడిబూతీ తీరుతుంది
అయ్యవారిని చేయబోతే కోతైనట్టు
అయ్యవార్లంగారు ఏచేస్తున్నరంటే ఒలకబోసుకుని ఎత్తిపోసుకుంటున్నా
                                రన్నారట
అబద్ధపుపెళ్లికి ముడ్ది వాయింపులాగ
అమ్మని తిడతావేరా లంజకోడకా అన్నాట్ట
అయ్యకి రెండోపెళ్లనిసంబరమేగాని తనికి సవతితల్లివస్తుందనేది తెలీదు
అరచేతిలో తేనెబోసి మోచేతిదాకా నాకించినట్టు
అడివిపంది చేను మేసిపోతే ఊరపందిచెవులు కోసినట్టు
అతనికంటెఘనుడు ఆచంటమల్లన్న
అతిరహస్యం బట్టబయలు
అతి వినయం ధూర్తలక్షణం