పుట:GodavarisimaJanapadaKalaluKridaluVedukalu.djvu/200

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

'జీవులెనుబది నాల్గు లక్షలు
చావు పుట్టుక లిక్కడా
ఎవరుచేసిన పాపఖర్మములనుభవించే దక్కడ ' అంటూ
జీవుని పాపపుణ్యాల ప్రకారం ఇహపరలోకాలలో పొందేకర్మలు చెబుతుంటే ఇక పాపాలు చేయరాదనిపిస్తుంది. (ప్రసూతి వైరాగ్యం)

               'తకతై తకతై తోలుబొమ్మా దీని తమష చూడవె మాయ బొమ్మా ' అంటూ దేహంయొక్క అశాశ్వతత్వాన్ని చెబుతుంటే తాత్కాలికంగానైనా దైవచింతన పొందవలసిందే ప్రతివారూను.
              ఇక పోతులూరి వీర బ్రహ్మంగారి కాలజ్ఞానతత్వాలు జానపదులకు పెద్దబాలశిక్ష. వీని భావర్ధాలూ అంతరార్ధాలూ నిత్య శోధనీయాలే.

"నందామయా గురుడ నందామయా
ఆనంద దేవికే నందామయా - ||నం||
తాడి చెట్టూక్రింద తాబేలుపుడుతుంది
దేశమంటా కరువు వచ్చేనయూఅ - ||నం||
అత్తలకు పీటలు
కోడలకి మంచాలు
కొడుకు తల్లిని కట్టి కొడతాడయా - ||నం||
రాచూరి దగ్గర రాతి బసవన్నలు
రంకె వేసే కాల మొస్తుందయా
కుక్కతోకాపట్టి గోదారీదితే
కోటిపల్లీకాడ తేలేనయా- ||నం||
వీరబ్రహ్మంగారు వీధమ్మటొస్తారు
వీధీధికిద్దరిని కంటారాఅ -
"హరిగోవిందగోవింద భజ గోవిందగోవింద" అనే తత్వం -


'చెప్పలేదంటనక పొయ్యారు
ంరులార గురుని చేరి మ్రొక్కుతు బ్రతుక నేర్చారు
చెప్పలెదంటనక పొయ్యారు
తప్పదిదిగో గురుని వాక్యము