పుట:GodavarisimaJanapadaKalaluKridaluVedukalu.djvu/199

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

ఆ సాధన చేస్తున్నారా అంటే శ్రీ శ్రీ గారు చెప్పిన సమాధానమే దెవెనికి వర్త్రిస్తుంది. "రోడ్డు మీద పలానా ఊరికి దారి అని వ్రాయబడ్డ బోర్డు ఆవూరికి దారి చూపింస్తుందే గాని ఆ వూరు వెళ్ళదుగా" అని.

                  పా ర మా ర్ది క గీ తా లు

"మూణ్ణాళ్ల ముచ్చటికి మురిసేవు తరిసేవు
  ముందుగతి గానవే మనసా" అని--,
"ఇల్లు ఇల్లనియేవు ఇల్లు నాదనియేవు నీ ఇల్లు ఏదిరా ఓరీ
ఊరికి ఉత్తరాన సమాధిపురంలో కట్టె ఇల్లున్నదే చిలుకా -
కట్టేలే చుట్టాలు, కర్రలే బంధువులు
కన్నవారెవ్వరే చిలుకా
నువ్వు కాలిపోయేదాక కావలుందురుగాని
వెంటనెవ్వరు రారు చిలుకా" అని -,

"వస్తానట్టిది పోతానట్టిది ఆశలెందుకంట
పోయేనాడు వెంబడిరాదు పూచికపుల్లైనా -
చేతిలో బెల్లం ఉన్నంత వరకే
చీమ బలగమంటా
చేతిలో బెల్లం చెల్లిందంటే ఎవరు రారు వెంట -
ప్రమిదిలో నూనె ఉన్నంతవరకే
దీపమెలుగు నంట
ఆ ప్రమిదలో నూనె అయిపోగానే
దీపమారునంట -
పంచభూతముల తోలుబొమ్మతో ప్రపంచ మాయెనట
మట్టికుండయిది నమ్మరాదు, ఈ మధ్య మెరుగుమంట"
అని పాడుతుంటే విన్నవాళ్లు ఆ కాసేపూవైరాగ్య భావాన్ని పొందుతారు (స్మశాన వైరాగ్యం). అలాగే-

"ఏమెజన్మము ఏమిజవనము ఈ మాయకాయము" అంటూ దేహ స్వరూపాన్ని వర్ణిసుంటే దేహంమీద స్వల్పకాలమయినా విరక్తి పుడుతుంది.