పుట:GodavarisimaJanapadaKalaluKridaluVedukalu.djvu/198

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

ఆ ఆటలో మంచి అర్ధముందన్నా
అర్ధమెరిగినవాడుహరిగురుడోయన్నా
ఈజన్మామికా దుర్లాభమురా-
నాశికములో దృష్టి నడిపించుమన్నా
నడిపించిమరి నీవు నమ్మియుండన్నా
పీఠామెక్కిన అంబ పిలుచూనోయన్నా
పిలిచినంతట నీవు నిలుచుండుమన్నా
నిలిచినంతవాడె నిజరుగుడోయన్నా
ఈ జన్మామికా దుర్లాభమురా”- అనీ,

చిల్లర రాళ్ళకు మ్రొక్కుతుమంటే
చిత్తము చెడునురా ఒరేఒరే
చిత్తములోనీ చిన్మయ జ్యోతొని
చూచుచుండుటా సరేసరే
నెళ్ళలో మునిగి గొణుగుచునుంటే
నిలకడ చెడునుర ఒరేఒరే
నీళ్ళలోనుండే నిర్మలజ్యోతిని చూచుచుండుటా సరేసరే
భూములు అడవులు తిరుగుచునుంటే
బుద్ధులు చెడునుర ఒరేఒరే
బుద్ధిలోయుండే పున్నమ చంద్రుని
చూచుచుండుటా సరేసరే” - అనేతత్వం.

“ఓం నమశ్శివాయి సిద్ధమైనా వుదని
ఓంకారమేదిరా ‘ ఓరీ
ఒనరుగా త్రికూట భ్రూమధ్యంజ్ందున్న
వాడెవ్వడో చూడరోరీ
ఆ అలుఎనిమిది అక్షరములకు మూల
హరుడెవ్వరో చూడరోరి
అకారమును చిలక హంసతో గూడుకొని
ఆడించు చున్నదీ జరీ“-
అంటూ జనులకు ముక్తి సాధనకై భోధచేస్తారు, ఈచెప్పేవాళ్ళు