పుట:GodavarisimaJanapadaKalaluKridaluVedukalu.djvu/193

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

"నాయుడోరింటికాడ నల్ల తుమ్మ చెట్టు కాడ
నాయుడేమన్నాడె పిల్లా
అబ్బ నా గుండె జల్లు మన్నదె రైటో -
రెండిళ్ళ సందునా రోలేసి కూకుంటే
దెయ్యూమ ఉకుంటినే పిల్లా
అబ్బ నా గుండె జల్లు మన్నాదె రైటో" అనే పాట-

"ఎక్కుమామా బండెక్కుకామా" వంటి శృంగార రసభరితమైన పాటలు ముసలివాళ్ళను కూడా మురిపిస్తాయి.

"చల్ మోహన రంగా
నీకు నాకూ జోడు కలిసెను కదరా -
నీకు నాకూ జోడు అయితే
మల్లెపూలా తెప్ప కట్టి
తెప్పమీదా తేలిపోదాం పదరా
చల్ మోహన రంగా
నీకు నాకూ జోదు కలిసెను కదరా-

"నీకు నీవారు లేరూ
నాకూ నావారు లేరూ
ఏటి ఒడ్దున ఇల్లు కడదాం పదరా
చల్ మోహన రంగా
నీకు నాకూ జోడు కలిసెను కదరా" అనె పాట-

"ఓ.... పంచదార వంటి పోలీసెంకటస్వామి, నిన్ను నేనూ
మరవలేనురా
నీకు వచ్చింది కోర మీసం
నాకు వచ్చింది దోర వయసు
ఇద్దరి మనసూ ఒక్కటైతే
వెనక చింత లేని బ్రతుకే మనది
ఓ....పంచదార వంటి పోలీసెంకటస్వామి
నిన్ను నేనూ మరువ జాలరా-