పుట:GodavarisimaJanapadaKalaluKridaluVedukalu.djvu/192

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

గుండ్రాని కళ్ళమీద
మోజేల లేదే!
ఓ చిన్నదానా, విదువదె కొంగు -
నల్లా నల్లానిదాన
నాతీనడకల మీద
మోజేల లేదే!
ఓ చిన్న దాన, విడువనె కొంగు ' అనే పాట--
'ఎల్లకెల్ల కెల్తినమ్మ గోంగూరకి
నన్ను పాకచుట్టు తిప్పాడె గోంగూరకి
పాకలోకి లాగాడె గోంగూరకి
కొంగు పట్టుకున్నాడె గోంగూరకి
రైకముడి ఇప్పాడె గోంగూరకి
మాయదారి నాకొడుకు గోంగూరకి
నన్ను మాయజేసి ముంచాడే గోంగూరకి అనే ఊడ్పుల దగ్గరపాట.

'వానాగాలొస్తోంది మావయ్యగారూ
గేదెనెక్కడ కట్టనండి మావయ్యగారూ
అక్కడిక్కడ కాదె కోడలపిల్లా
కొట్టంలో కట్టవే కోడలుపిల్లా ' అనే పాట- (దీన్ని ఆశ్లీలంగా పాడుతారునుకొండి).

'లబోలబో లబు జనక
అబ్బదీని సోకో జబ్బలదాక జాకెట్టు ' అనే పాట -

"నిన్ను రమ్మన్నాది నన్ను రమ్మాన్నది
ఇద్దర్ని రమ్మాని నిద్దారోయిందో
నెరానెరా నెరబండి - నెలవరిదండో
నెరానెరా నెరబండి - అనే పాట,