పుట:GodavarisimaJanapadaKalaluKridaluVedukalu.djvu/176

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

"కాపులసంఘం పీతలమంగం" అని, 'మంగం ' అంటే పచ్చితాటాకు మిఠాయి పొట్లంలా చుడతారు - అందులో 'మావు ' లలో దొరికిన చేపలు, పీతలు వేసి మూతికట్టి ఇంటికితెస్సారు. ఆమూతికట్టు విప్పడంతరువాయి పీతలు తలోవైపుకి పరుగులు తీస్తాయి. కాపులుకూడా ఇలాగే ఏదైనా బలవంతంమీద కొంతసేపు పట్టుగాఉన్నా మళ్ళీవిడిపోతారనేదానికి ఈ సామెత. అదే లీలగా ఈ గేయంలో కూడా కనిపిస్తుంది. "మావు" అంటే పల్లెలలో రైతులు తమచేలలో నీరువచ్చేబోదులదగ్గర అడ్డంగా ఎదురుచువ్వలతో పెట్టెలా చేసికట్టిన చేపలబోను. ఈ చువ్వలు అరంగుళం దూరంతొ కొబ్బరి నారతాడుతో కట్టి, చేపలు అందులో ప్రఫ్వేశ్వించడానికి క్రింద చిన్న కన్నం పెడతారు. దానిద్వారా నీటిలో వస్తున్న చేపలు, పీతలు లోపలికివెళ్ళి మళ్ళీ తిరిగి రాలేవు ఇది జాలరి వలలాంటిదన్నమాట.

ఉపాధ్యాయుని మీద కోపంవస్రే-
"మేష్టారు మేష్టారు మొట్టొంకాయ్
మేష్టారి పెళ్ళాం నీటోంకాయ్' అని పాడతారు.
మరీ ఘటికులైన కొంటెపిల్లలు దసరా పాటల్ని అనుకరిస్తూ యిలా పాడుతుంటారు.
"గిలకల్ని పట్టుకొని ఎలకల్ని చంపి
 మావూరు పంతులకు కూరోండిపెట్టి
 దాకదగ్గరపెట్టి దవడూడగొట్టి
 తాటాకు వెలిగించి తలక్రిందపెట్టి
 అయ్యయ్యె పంతులూ అయిపోయినావ
 మాదొడ్డపంతులూ మాడిపోయేవ
 జయాభిజయభవదిగ్విజయభవ."
ఇది "ఏదయా మీదయా మామీదలేదా" అని దసరాల్లో బడిపిల్లలుపాడే గిలకల పద్యానికి పేరడీ. ఇద్ ఉపాధ్యాయునిమీద ఆ విధ్యార్ధికి గట్టిగా కోపంవచ్చినప్పుడు ఆకసిని యిలా పాటలోతీర్చుకుంటారు. విధ్యార్ధుల కోపతాపాలమీద పల్లెటూళ్ళల్లో చమత్కారమైన ఒక చిన్న కధ కూడ ఉంది.