పుట:GodavarisimaJanapadaKalaluKridaluVedukalu.djvu/175

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

.”వానల్లూ కురవాలి వానదేవుడా
  వరిచేలూ పండాలి వానదేవుడా
  గాదుల్లూనిండాలి వానదేవుడా
  మాబొజ్జా నిండాలి వానదేవుడా.”
అని వర్షాన్ని ఆహ్వానిస్తారు. బాలవాక్కు బ్రహ్మవాక్కుగదా! మరీ చిన్నపిల్లలు ‘వానాలప్పా, తిరగాలప్పా ‘ అంటూ గిర్రునతిరుగుతూ తేలిపోతున్న అనుభూతిని ఆస్వాదిస్తుంటారు. కొన్నిచోట్ల ‘వానొచ్చే వరదొచ్చే బుడుగో బుడుగో ‘ అని పాడుతుంటారు.
“కొక్కొరోకోయని కోడి కూసింది
  తెల్లవారింది కాకిఅరిచింది
  అమ్మ లెమ్మంది ఆడుకోమంది“—
అనేపాట పిల్లలకు వేకువజామునే లేవాలనే ఒక మంచి అలవాటును అజ్ఞాతంగా ఉద్భోధిస్తుంది. ఇది Cocks crow in the morning అనే ఆంగ్లేయానికి దగ్గరగాఉంటుం ది.

పిల్లలకు ఏరిమీదనైనా కోపంవచ్చినప్పుడు ఆ మిత్రబృందమంతా జట్టుగాఏర్పడి ఎదుటివారికులాలమీదా, వృత్తులమీదా, పేర్లమీదా ఇలా ఎద్దేవా చేస్తూ పాడతారు.

కోమటి మీద:-
"కోమటి కోమటి కొత్తబెల్లం,
  కొంటే డబ్బుఖర్చు, తింటే కడుపునొప్పీ
  బ్రాహ్మడు మీద:-
"బేమ్మడు బేమ్మడు బెడ్డుముక్క
  చేల్లోపడితే చేపముక్క
  ఒడ్దునపడితే గడ్డిమొక్కా
కాపులమీద:-
"కాపులు కాపులు కయ్యాలూ
  తెల్లరిలేస్తే దెయ్యాలూ

కాపులకు వారిలోవారికి పడదట. వారిపై ఒక సామెత ఉంది.