పుట:GodavarisimaJanapadaKalaluKridaluVedukalu.djvu/174

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

అలాగే పిల్లలందరూ ఒకరిప్రక్కఒకరుకూర్చొని కాళ్ళు బారజాపుకొని 'కాళ్ళా గౙ్జీ కంకాళమ్మా ' పాటతో ఆ కాళ్లను ఒకటొకటిగాపండించుకుంటూ ఆడుకుంటారు అనందంగా. ఇందులో తమకాళ్ళు ముందు పండాలనేతపన ఆ లేతహృదయాల్లో జీవితంలో అన్నింటా తాం ముందుండాలనెమనస్తత్వానికి బీజమేస్తుంది. ఈ పాటలో 'కాళ్ల గజ్జికి ' ఏదో విఅద్యంచిట్కాకడా ఉందట.

పాటలో మరోఅందమైనఆట ఎవరోఒకరినెత్తిమీద వెనుకనుంచి ఒకచిన్న ఆకో, సాలిగూడో వారికితెలియకుండా వేసి

"ఒకమ్మగారినెత్తిమ్మెద గోరింక
 చెప్పకు చెప్పకు చినపాప
 చెబితే నీకళ్ళోతాయి"
అని వేసినవాళ్ళుపాడుతుంటె కూడాఅందరూపాడుతూ వినోదిస్తుంటారు అసలు మనిషి అదితెలిసికొని తీసివేసుకునేవరకూ.

"తపొపట్లోయ్ తాళాలోయ్
 దేవుడిగుళ్ళో బాజాలోయ్,
 పప్పూబియ్యం దేవుడికోయ్
 పాలూనెయ్యీ బాలుడికోయ్"
అని పాటపాడుతూ అందరూ ఒకే మాత్రా వ్యవధిలో చప్పట్లుకొట్టడం చిన్నప్పుడే తాళాన్ని నేర్పుతింది.

చిన్నగా వానతుంపరవస్తుంటే పిల్లలు వీధుల్లో చేతులుబారజాపుకొని తమ చుట్టూతాము గిరగిరాతిరుగుతూ ఆహ్లాదంగా--
"వానావానా చెల్లప్పా, కాకిలుతిరుగూ చెల్లప్పా
 తిరుగూతిరుగూచెల్లప్పా, తిరగలేనూ చల్లప్పా"
అంటూపాడుతూ ఆ తిరగడంలో కళ్ళుతిరిగి గాలిలోకి తేలిపోతున్నట్టు చిత్రమైనానుభూతిపొందుతారు. ఇలా తిరిగేటప్పుడు కొన్నిచోట్ల పిల్లలు --