పుట:GodavarisimaJanapadaKalaluKridaluVedukalu.djvu/173

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

అని సాయంవేళ చందమామనుచూపిస్తూ గోరుముద్దలు తినిపిస్తుంది మతోతల్లి.

"ఏడవకు ఏడవకు వెర్రిమాతల్లి
  ఏడిస్తే నీకళ్లు నీలాలు గారూ... ...
  నీలాలుగారితే నేజూడలేను
  పాలైనగారవే బంగారుకళ్లు
            జో జో....'
"అమ్మణ్ణి కన్నుల్లు తమ్మి పువ్వుల్లా
  తమ్మిపువ్వుల్లోని కమ్మ తేనెల్లూ.....
             జో... జో...
అని తల్లి పాడుతుంటే ఏడుపుమాని తల్లిఒడిలో హాయిగానిద్రిస్తుంది.
"జీర్ణంజీర్ణం వాతాపీజీర్ణం
  గుర్రంతిన్న గుగ్గిళ్ళు జీర్ణం
  ఏనుగుతిన్న వెలక్కాయజీర్ణం
  భీముడుతిన్న పిండివంటలజీర్ణం
  అర్జునుడుతిన్న అప్పడాలుజీర్ణం'
అని తల్లి బిడ్దకు ఉగ్గుపెట్టి తనకోర్కెను పాటలోమిళితంచేసి పాడి, అరగడానికి చిన్నవ్యాయామంల్గా ఆ పసికందు చేతొలూ, కాళ్ళూ, రెండుసార్లు అటూయిటూ ఊపి, నిమురుతుంటే ఆ శిశువు బోసినవ్వులు కురిపిస్తూ తల్లినిఅ మురిపిస్తుంది.

                       బా లా నం దం

ఇక పిల్లల ఆటలలో పాటలు:-

మరీ చిన్నపిల్లలు ఉత్సాహంగా ఒకపిడికిళ్లమీద మరొకరిపిడికిళ్లు పెట్టి పైపిడికిలి మధ్యఖాళీలో వ్రేలుపెట్టిత్రిప్పుతూ "గుడిగుడి గుంచం గుండారాగం" అని పాటలా పాడుతూ బలే ముచ్చటగా మురిసిపోతూ పరవశిస్తుంటారు.