పుట:GodavarisimaJanapadaKalaluKridaluVedukalu.djvu/163

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట అచ్చుదిద్దబడలేదు


"రమణీ యార్ధ ప్రతి పాదక శబ్ద: కావ్యమ్" అన్నాడు జగన్నాధ పండిత రాయలు. అందమైన అర్ధాన్ని స్ఫురింపజేసే శంబ్దమే కవిత్వమని దీని అర్ధం. దీనికి ఆదునికంగా ఒక ఉదాహరణ పేర్కొనవచ్చు. రంగమ్మ అనే ఆమెకు రంగన్న అనే ఒక కొడుకున్నాడు. అతని చిన్నప్పుడే తండ్రి చచ్చిపోయాడు అంటూ సామాన్యంగా చెప్పుకొనే విషయాన్ని 'రంగన్న రంగమ్మ కొడుకు, రంగమ్మ రంగు చీర కట్టడం రంగన్న ఎరగనే ఎరగడు ' అని చెబితే ఎంత రమణీయంగా ఉంటుంది! ఇలా రమణీయార్ధన్నందించే శబ్రాల కూర్పే కవిత్వం అని పండిత రాయల మతం.

"వాక్యం రసాత్మకం కావ్యం' అన్నాడు విశ్వనాధుడు. అంటే రసస్పూర్తి కలిగిన వాక్యమే కవిత్వం. ఇది ఏరసమైనా కావచ్చు, బసవరాజు అప్పారావుగారు వారి పశిబిడ్డ చనిపోయినప్పుడు దు:ఖోద్వేగంతో 'కాపురమొచ్చిన కన్నె పాపాయి యిల్లు కాళీ చేసి వెళ్ళి పోయాడు" అని కరుణ రస భరితంగా వ్రాసిన వాక్యం ఒక ఉదాహరణ. అలాగే లీలా శుకుని కృష్ణ కర్ణామృతంలోని యీక్రింది శ్లోకం మరొక ఉదాహరణ--

"రాధా పునాతు జాదచ్యుత దత్త చిత్తా, మంధాన మాకలయెతే
  దధిరిక్త పాత్రౌ, తస్యాస్తన స్తబక చంచల లోల దృష్టి: దేవో
 దోహన ధియా వృషభం నిరుంధన్".

శ్రీ కృష్ణుడు పాలు పిదుకడానికి గోశాలకు వెళ్ళాడాట - అక్కడీకి గవాక్షంలోనుంచి గరిలో చల్ల చేయడానికి ఉద్యుక్తురాలౌతున్న రాధ కనిపించిందట - ఆమెను చూసి9న కృష్ణుడు మైమరచి ఆవుకు వేసే బంధం ఎద్దుకు వేస్తున్నాడట -కృష్ణుని చూసిన రాధ పరవశించిపోయి కళీ కుండలో కవ్వంపెట్టి చిలికేస్తోందట. ఇది శృంగార రస సమ్మిళితమైన వాక్యం. వాక్యం అంటే ఒక్క వాక్యమే అని కాదు అర్ధం - వాక్య సముదాయమని. అలాగే శబ్ధం అంటే శబ్ద సముదాయమని అర్ధం.

"శబ్దార్దే సహితొ కావ్య్హం" అంటాడు భామఃహుడు. మనిషికి సౌందర్యాన్నికూర్చే నగలలాగ శబ్దార్దాలతోకూదినశరీరానికి అలంకారాలు సౌందర్యహేతువులనీ ఆ సౌందర్యమేకవిత్వమనీ అంతరభావం. ఉదాహరణకి కాళిదాసు రఘు వంశంలో-