పుట:GodavarisimaJanapadaKalaluKridaluVedukalu.djvu/156

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

సంగీతం. ఇక శాస్త్రీయ సంగీత్ందగ్గరకొస్తే దీనికి ఆదరణయించుమించు కరువై పోతున్నట్లే. రేడియోవాళ్ళ అండలేకుంటే యిది ఏనాడో మ్యూజియంలోకి పోయుండేది. ఇందు ఎవరితప్పూలేదు, యుగధర్మం.

                     జానపద సంగీతం

పల్లీయుల నిత్యజీవితంలో ప్రతి పనిలో ఏదొకరూపంగా లయాన్వితమైన గానం మిళితమై ఉంటుంది. కూనిరాగం తీయనివాడు, వానలో తడవనివాడు ఉండడు. వ్యవసాయ పనులలో ఊడ్పులు, కలుపుతీతలు, కోతలు, నూర్పులు వగైరా పనులలో పాటలు, జోలపాటలు, లాలిపాటలు, ఉయ్యాలపాటలు, పెళ్ళీ పాటలు, గొబ్బిపాటలు, పిల్లల ఆటల పాటలు, దంపుళ్ళ పాటలు, పడవలాగు వారి పాటలు, రోడ్దుకూలీల పాటలు, తత్వాలు మొదలగు జానపద గేయాలలో పండించే సంగీతమే జానపద సంగీతం. బుర్రకధ, జముకుల కధ, తంబుర కధ, తోలుబొమ్మలాట వరి బాణీలు, నేటి పౌరాణిక పద్యరాగాలూ కూడా జానపద సంగీత సంబంధులే. ప్రకృతి దత్తంగా వచ్చిన శృతే దీనికి జీవం. ఇవన్నీ గాత్రానికి సంబంధించినవి. ఇక జానపద వాద్యసంగీతానికొస్తే ఇవి చర్మ సంబంధమైనవి. తంత్రీసంబంధమైనవి, లోహ సంబంధమైనవీను. ఇవి వారే తయారుచేసుముంటారు. భేరి, మృదంగం, డప్పు, బుడబుక్క, తప్పెట, వీరణం, రాండోలు, కంజరి, డోలక్ మొదలగునవి చర్మ సంబంధమైన వాద్యాలు జేగంట,తాళాలు, గజ్జెలు,అందెలు లోహ సంబంధమైనవి. పిల్లనగ్రోవి, కోలాటం కర్రలు, చిరుతలు కొయ్య సంబంధమైనవి. అసలు శాస్త్రీయసంగీతానికి మూలం యీ జానపద సంగీతమే.

  • "జానపదుల సంగీతం సాహిత్యం వేరువేరుకాదు. చంద్రునితో వెన్నెలలాకలిసే ఉంటాయి. వారి నిత్యజీఫితంలో ప్రతిఘట్టము అమాయక,అకల్మష హృదయతంత్రుల్ని యిట్టే స్పందింపజేస్తాయి. ఆయా సందర్భాలను బట్టి, చేసే పనులనుబట్టి, తగిననడకలతో, లయతో రసాన

  • జానపదగేయ సాహిత్యం, నేదునూరి గంగాధరం, పుట. 4, (జానపద సాహిత్యం)