పుట:GodavarisimaJanapadaKalaluKridaluVedukalu.djvu/138

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

అక్కడవలె యిక్కడ కూడా బుద్దుని వివిధగతి రూపాలు, జాతకకధలు దేదీప్యమానంగా చెక్కబడ్డాయి. ఈ నాటికీ సకల సౌందర్య విలసితాలై చూపరులను చకితుల్ని చేస్తున్న యీ శిల్పాలు చెక్కిన ఆ మహాతపస్వియైన ఆంధ్ర స్థపతి యెవ్వరో గదా!

"ఈ నల్లని రాలలో ఏ కన్నులు దాగెనో,!
  ఈంబండల మాటునా ఏ గుండెలు మ్రోనో!"

                          రామప్ప గుడి

కాకతీయ రాజులు శిల్పకళా ప్రియులు. తెలంగాణాలోని రామప్పగుడి, ఓరుగల్లు కోట, హనుమకొండలోని వేయిస్తంభాల మండపం వీరి ఉత్తమకళా పోషణకు తార్కాణాలు. హైందవ శిల్పం అచ్భుతంగా పెంచి పొషించబడింది వీరి హయామంలోనే. వానిలో రామప్పగుడిలోని శిల్పచాతుర్యం కళాకారుణ్ణి కదిలిస్తుంది. రచయితను ఉద్రేకపరుస్తుంది. నాట్యరాణులను నర్తింపజేస్తుంది. సామాన్యుణ్ణి చకితుణ్ణి చేస్తుంది. దేశప్రసిద్ధిగన్న బేలూరు, హొయసల శిల్పాలు చెక్కిన అమరశిల్పి జక్కన్నకు సమఉజ్జీ ఈ శిల్పి. ఇందలి నాట్యకత్తెల సౌందర్యం వర్ణనకు అందనిది. విలువెత్తు విగ్రహాలు, స్తన జఘన లావణ్యం రమణీయం - సర్వాంగసుదరం. వీరి నృత్యరీతులు, శివతాండవం చూపరులను పులకరింపజేస్తాయి. అత్య్హంత సుందరమైన నగ్ననాగిని ప్రతిమ ఓ ప్రత్యేకత. నంది విగ్రహం కనులకు విందు. స్తంబ శిల్పానికి విస్తుపోవలసిందే. ఇవి ఆంధ్ర శిల్పానికి కీర్తిస్తంభాలు. వీనిలో మన నీడలు కనిపిస్తాయి. అంధ్ర సంస్కృతికి, ఆంధ్ర శిల్పకళా నైపుణ్యానికి రామప్ప దేవాలయ శిల్పాలు మణి దీపాలు.

                        ఓ రు గ ల్లు

ఇదే నేటి వరంగల్లు. ఇక్కడి కోట, కోట ద్వారాలు, ద్వార తోరణాలు తెలుగు శిల్ప కళామతల్లికి ఆభరణాలు. కోటలోని నంది కాకతీయుల కళా తృష్ణకు నిక పోవలం