పుట:GodavarisimaJanapadaKalaluKridaluVedukalu.djvu/136

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

వందల సంవత్సరాలనాటి మొహంజొదారో, హరప్పా శిధిలాలలో బయల్పడిన శిధిల శిల్పాలు ప్రాచీన భారతీయ నాగరికతకు ప్రతిబింబాలు.

తెలుగు సీమలో యీ శిల్పకళా ప్రాభవాన్ని వేనోళ్ళ చాటే అమూల్య సంపద పుణ్యక్షేత్రాలను, ఆరామాలను అంటిపెట్టుకొని విదేశీయుల్ని సహితం విభ్రాంతుల్ని చేస్తోంది వీనిలో ముఖ్యంగా అమరావతి, నాగార్జున కొండ, హనుమకొండ, ఓరుగల్లు, రామపోగుడి, అలంపురం, కాళహస్తి, శ్రీశైలం, సింహాచలం, ద్రాక్షారామం, లేపాక్షి, ఆంధ్ర శిల్ప కళా వైభవనానికి నివాళులర్పిస్తున్న చోట్లు.

భారతీయ శిల్పాలకు ఎక్కువగా గుహలూ, కొండలూ, దేవాలయాలూ, కోటలూ, స్థూపాలూ, స్థావరాలు, అజతా, ఎల్లోరా, ఎల్ఫెంటా గుహల శిల్ప సౌందర్యం ప్రపంచ శిల్ప సంపదకే తలమానికం. గ్రీస్ లో ‘వయిడీస్ చెక్కిన ఏడు నిలువుల ఎత్తుగల ‘జుపిటర్ ‘ విగ్రహం ప్రపంచ వింతలలో ఒకటనుకుంటే, రోం లోని సీజర్ విగ్రహం, అమెరికాలోని వాషింగ్టన్, లింకన్ విగ్రహాలు నిడివిలో గొప్పతనాన్ని చాటుకుంటే, (ఒక్కొక్కదాని పోడవు 465 అడుగులు) మాస్కోలోని లెనిన్ పాలరాతివిగ్రహం సహజత్వానికి దర్శనీయమనుకుంటే, మన అజంతా సుందరి జగదేక సౌందర్యానికి విశ్వ విఖ్యాతి పోదింది. ప్రాచీన కాలంలో భారతీయ శిల్పం రాజుల ఆదరణలోనూ, మతాల పరిపోషణలోనూ మ్మొడు పువ్వులూ ఆరుకాయలుగా వికసించింది. అశోకుడు, కనిష్కుడు, హర్షవర్దనుడు యిచ్చిన చేయూత అనల్పం. గుప్తరాజులకాలము దీనికి స్వర్ణయుగమే. ఆనాడు హిందూ బౌద్ధ శిల్పాలు రెండూ శరవేగంతో పురోగమొంచాయి. అశోకుని కాలంలో సాంచీ, బుద్ధగయ స్థూపాలూ, కనిష్కుని కాలంలో తక్షశిల స్థూపాలూ, గుప్తుల అజంతా శిల్పాలూ వారి కళాభిరుచికి ప్రతీకలు.

గ్రీకుల డండయాత్రలో కనిష్కుని కాలంలో క్రీ. శ. 1వ శతాబ్ధిలో బౌద్ధశిల్పం, గ్రీకుశిల్పం కలిసి గాంధార శిల్పమనే క్రొత్తరూపాన్ని దరించింది. ప్రతిమలో వాస్తవికత ప్రతిబింబించడం దీని ప్రధాన లక్షణం. కట్టుకున్న బట్ట మడతలుకూడా యధాతధంగా చెక్కవడతాయి. భారతీయ శిల్పంలో తెలుగు శిల్పుల బాణీ “ఆంధ్ర శిల్ప“ మని ఒక ప్రత్యేకత గడించుకున్నది. అదే అమరావతి శిల్పం.