పుట:GodavarisimaJanapadaKalaluKridaluVedukalu.djvu/124

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

నిర్మాణాలతో ఆకాశాన్ని అందుకోవాలనే తాపత్రయం అధికంగా కనిపిస్తుంది. నినాదాలు, ఉద్యమాలు అనుచిదిన దర్శనాలు. యజమానుల కూలీల పోరాటాలు పట్టణాలలో కనిపిస్తే రైతు కూలీల సామరస్యం పల్లెలలో కనిపిస్తుంది. ఎంత కూలిచ్చినా తృప్తిలేదంటాడు మిల్లు యజమాని, మాకండలు కరిగించిన శ్రమంతా యజమానిదోచుకుంటున్నాడంటాడుకూలీ. ఇది పట్టణాలలో కనిపించే అనుదిన పోరాటం. ఇది నాగరికత.

నాగరికుల జీవితాలు జీతనాతలపై బ్రతుకులు - జానపదులు వారి స్థిరచరాస్థులపై వచ్చే ఆదాయంతో రెక్కల కష్టంచేసి బ్రతుకుతారు. జానపదస్త్రీలు వంటినిండా చీర, పొడుగుచేతుల రఫికెలు ధరిస్తారు. నాగరిక స్త్రీలు గౌనులు, స్లీవ్ లెస్ జాకెట్ లు వగైరా పాశ్చాత్య వస్త్ర ధారణతో మురిసిపోతరు. జానపదులలో పురుషులు పంచె, జుబ్బా, తలపాగ ధరిస్తారు. నాగరికులు దరింఛేవి ఫ్యాంట్, షర్టు, వీనితో విదేశీ ప్రభావంతో వచ్చే రకరకాల మోడల్సు. జానపదులు మూతిమీద మీసం రోషానికి చిహ్నంగా పెంచుతారు. మీసం మీద నిమ్మకాయ నిలబెట్టడం వారి పౌరుష చిహ్నం - నాగరీకులు అసలు మీసాలే ఉంచరు. అదే నాగరికత. చాకలి బట్టలుతకడం, మంగలి క్షవరం చెయడం, మాదిగ చెప్పులు కుట్టడం, కోమట్లు వ్యాపారం చేయడం, మేదరి తట్టలు అల్లటం, బ్రాహ్మణులు పౌరోహిత్యం చేయడం, రైతులు పంటలు పండించి ఆ పంటను వారీకి పంచటం జానపదుల జీవన సరళి. ఇక్కడ ఊరంతా ఒక్క కుటుంబం - పట్టణం అంతా యంత్రాలమీదే నడక. వృత్తికి కులం నిమిత్తం లేదు. నేర్పరితనం ప్రధానం. సంపాదనే ముఖ్యం. నాగరికులు మార్గకవితను అభిమానిస్తారు. జానపదులు దేశ కవితను ఆరాధిస్తారు. జానపదులు నిష్కపటంగా ఉన్నవిషయాన్ని కుండబద్దలుకొట్టినట్లు మాట్లాడుతారు - కుతంత్రాలతో మనిషిని పడగొట్టడం మేధవందులైన నాగరికుడు చేసే పని. నాగరికులది వ్యష్టి జీవితం - జానపదులది సమిష్టి జీవితం. నాగరికులు బుద్దిజీవులు, జానపదులు అమాయకులు.

ఇది ఒకనాటిమాట. ఈనాడు నాగరికత పల్లెలలో కూడాప్రాకి జానపదుల నాగరికలక్షణాలు అలవాటు చేసుకుంటున్నారు. ఇప్పుడు నాగరికులు జానపదులు అనే భేదం లేదు. జానపదం నశిస్తోంది - నాగరికం సర్వత్రా నాట్యం చేస్తోంది.