పుట:GodavarisimaJanapadaKalaluKridaluVedukalu.djvu/123

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

నాయిలుబుడ్లు, ఇలాయి దీపాలతో కూడా పనులు చక్కబెట్టుకుంటారు. నగరాలలో అద్దె ఇండ్ల కాపురాలు. అందుకే వారిలో కీచులాటలు ఎక్కువ. అన్నిటికీ యింటి యజమానుల అరుపులు, ఆంక్షలు వీనిమధ్య ఎప్పుడు ఇల్లు మార వసలసివస్తుందో అని నిరంతర ఆందోళన. జానపదుల పాకల్లో నివసించినా స్వంతకొంపల్లో స్వేచ్చా జీవితం వారిది. నాగరికుల ప్రభుత్వ కుళాయిల దగ్గర కీచులాటలు పట్టణ వీధులలో ప్రభాత దృశ్యం. జానపుదులు కోనేటికో, కాలువకో వెళ్ళి నీలాటి రేవుల్లో నీరు ముంచుకొని గుంపులు గుంపులుగా కబుర్లాడుకుంటూ సరదాగా జలకాలాడి బిందెలతో మంచినీళ్ళు తెచ్చుకుంటారు - ఎండుగతో నీరు శుభ్రపరుచుకుంటారు. ఎండుగ అంటే - ఎండుపుకాయ గంధంతీసి నీటిలో కలిపితే ఆనీటిలో ఉన్న మలినం పోతుంది. పూజలు, పుణ్యకార్యాలంటే జానపదులకు మక్కువ ఎక్కువ. నాగరికులు అదొక అనాచారం క్రింద చూస్తారు. నగరంలో అన్నీ రాచకార్యాలే. పల్లెలలో అన్నీ ప్రజాకార్యాలే. పొద్దుపోతే పట్టణం తొందరగా నిద్రపోతుంది. పల్లేలలో పొద్దుపోయినా ఏదో సందడే. మరల కోడికూతతో పల్లె మేలుకొంటుంది. ముసలివాళ్ళు ఏవో తత్వాలు పాడుతుంటారు. యువకులు బయలుదేరి పొలాలకు వెళతారు. స్త్రీలు వీధులలో పాచితుడిఛి, కళ్లాపిచల్లి ముగ్గులలో నిమగ్నులవుతారు. పట్టణం తెల్లవారి బారెడుఇ పొద్దెక్కిన తరువాత లేస్తుంది. పనిమనిషి వచ్చిలేపాలి లేదా పాలవాదు లేపాలి. అక్కడనుండి అంతా అడావిడే. పల్లీయులు తాపీగా పనులు సాగిస్తారు. తొందర దేనిలోనూ ఉండదు. పల్లెలలో పశు సంతతి ఎక్కువ - పట్టణాలలో జనసంతతి ఎక్కువ. జానపదులు తమ పనులు తాము స్యయంగా చేసుకుంటారు. నాగరికులకు పనిమనుషులు రాఅసిందే. వాళ్ళు లేనిదే పనులు జరగవు. వాళ్లు రానిరోజు వీళ్ళ ఇళ్ళల్లో వొళ్ళువంగక అన్నీ రుసరుసలు, బుసబుసలే మనకు దర్శనమిస్తాయి. నీళ్లు కఱువు, పాడి కఱువు. గాలి కఱువు; ఇదీ నగరజీవితం - ఇవి పుష్కలం పల్లె జీవితంలో పట్టణాల్లో అంతా చదువులు, సినిమాలు, పరిశ్రమలు, ఆఫీసులు, వ్యాపారాలు, రాజకీయాలు, (రాచకయ్యాలు) సందడి తప్ప మరే కళభిరుచీ కనబడదు. ఇక్కడ ప్రతి హృదయం అలజడి, ఆందోళనలతో నిండి ఉంటుంది - పల్లె నిర్మలంగా నిద్రపోతుంది. కళలు, కధలు, సహకారం, సౌజన్యం, సౌభాగ్యాలతో ఆనంద సందోహంతో చిందులు వేస్తుంది. పచ్చని పైరుపొలాలతో చిగురించే తరులతలతో ప్రకృతి సౌందర్యం పరవశిస్తూ ఉంటుంది - మరి నగరాల్లో అంతస్థులమీద అంతస్ధుల