పుట:GodavarisimaJanapadaKalaluKridaluVedukalu.djvu/122

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

నాగరికులలో పండగలకి, పబ్బాలకి ప్రాముఖ్యం నామమాత్రం - భక్తికూడా అంతంత మాత్రం. వారి చూపు మానవచేతనమీదే. ఏదో సాధించాలన్న తపన - దానికై నిత్యాన్వేషణ - విజ్ఞాన పురోగతికై ఆలోచన. ఇవీ నాగరికుల జీవనగతులు. సంఘ కట్టుబాట్లు, కుల కట్టుబాట్లు, మత కట్టుబాట్లు వంటివానికి వీరు కట్టుబడరు. మన సంస్కృతిపై చిన్నచూపు, పాశ్చాత్య సంస్కృతిపై పెద్దమోజు. జానపదులది కల్తీలేనిమాట - సూటిగా మాట్లాడడం అనేది నాగరికులకు దూరం. అది గొప్ప తెలివిక్రింద లెక్క.. నాగరికులలో ఇంటికి ఎవరైనా బంధువులు వస్తే తొందరగా పంపివేయడం ఎలాగ అనేదే ఆలోచన - జానపదులు బంధువులు వస్తే పదిరోలులుండమని బలవంతం చేసి పెద్ద పెద్ద విందులతో ఆనందింపచేస్తారు. జానపదుల సంస్కారం హృదయగతం. నాగరికుల సంస్కారం బుద్ధిగతం. నాగరికులు మేధా సంపన్నులు. జానపదులు హృదయ సంపన్నులు, నాగరికులు బండ్లమీదో, రిక్షాలమీదో, కరులమీదో, మోటారుసైకిళ్ళమీదో తిరగడం తప్పిస్తే కాలినడక అనాగరికంగా భావిస్తారు. అందువల్ల వారికి శరీర పరశ్రమ తక్కువ, రోగాలెక్కువ, ప్రతిచిన్న జబ్బుకూ సూదిమందులు, బిళ్ళలు వీరివాడకం. (అల్లోపతి వైద్యం). జానపదులు కాలినడకకే ప్రాధాన్యత ఇస్తారు. కొందరు వందలాది మైళ్ళు కూడా కాలినడకనేప్రయాణంచేస్తారు. అందువల్ల దేహపరిశ్రమ జరుగుతుంది - దీర్ఘాయువు కలుగుతుంది. నాగరికులు కాఫీ, టీలకు దాసులు. వీరి అతిధి మర్యాదలలో మొదటిది 'టీ ' యిచ్చి మాట్లాడడం, (భోజనం చేయమనడం తక్కువ). జానపదులు అతిధులకే చల్లని మజ్జిగ ఇచ్చి మాట్లాడుతారు. భోజనం చేస్తేగాని వదలదు. నాగరికులది ఉదయం ఖరీదైన బడా హోటళ్ళలో టిఫిన్ కాఫీలు, మధ్యాహ్నం రాత్రి భోజనం - జానపదులది ముప్పొద్దు భోజనం. ఉదయం చద్దన్నం. (చాలామంది తరవాణీ పోసుకుని ఉల్లిపాయనంజుకుని చద్దన్నంతింటారు.) నాగరెకులు కనీసం ప్రక్కవారితో కూడా మనసు విప్పి మాట్లాడరు. వారికి స్నేహితులు టి.విలు, రేదియోలు, సినిమాలు మాత్రమే - ఇక జానపదుల దగ్గరకువస్తే - ఊరి ముందర గలగల పారే సెలయేరు, ఏటిగట్టు చెట్టుమీద కూర్చున్న పశువులుకాచే పిల్లవాని పిల్లనగ్రోవి సాదరంగా స్వాగతం పలుకుతాయి. నగరంలో అయితే స్వాగతం పలికేది యంత్రాల రణగొణధ్వని మాత్రమే. నాగరికులు విధ్యత్ కాంతుల్లో గాని విహరించలేరు. జానపదులు అరికెన్ లాంతర్లు కిరస