పుట:GodavarisimaJanapadaKalaluKridaluVedukalu.djvu/114

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

క్రీ డ లు

జానపదుల క్రీడలు (ఆటలు) స్వాభావికమైనవి. ఖర్చులేనివి ఆరోగ్య ఆనందాలకు ఆట పట్టులు. ఇవి మానసికంగానే కాక దైహికంగా కూడా ఆరోగ్య ప్రధాయినులు. మనిషికి తెలియకుండానే దేహ పరిశ్రమ చేయిస్తాయి. బాలలనుండి వృద్ధులవరకూ చిరునవ్వులు చిందింప చేస్తూ ఈ ఆటలలో పాల్గొనేటట్టు చేసే ఆకర్షణ కలిగిన అయస్కాంతశక్తి వీనిలో ఉంది. అందుకే ఇవి నేటికీ సాగివస్తున్నాయి.

                          వే డు క లు

ఈ వేడుకలు పండుగలలోనూ, పెళ్ళిళ్ళలోనూ, పర్వదినాలల్లోనూ విశేషంగా చూస్తాం. ప్రతి హృదయం పులకరించవలసిందే. ఏ ముఖం చూసినా ఆనందోత్సాహాల సుందర మందిరమే. మాటల్లో, చేస్టల్లో. చూపుల్లో చమత్కారాల్లో వీని సందడి సామాన్యుల దగ్గర నుండి అసమాన్యుల వరకూ మరో లోకంలో విహరింప జేస్తాయి. కాబట్టే నాగరికత ఎంత పెరిగి పోయినా ఈ వేడుకల తుషారం పన్నీటిజల్లుల్లా జానపదుల హృదయాల్ని కవ్విస్తూనే ఉంటుంది.

                           *****