ఈ పుట అచ్చుదిద్దబడ్డది
అనుచు పులిఁ జేరి 'తిను' మంచు నావు పెనఁగ
నీకు మ్రొక్కెద నాజోలి రాకు మమ్మ
తినను తిన' నంచు బెబ్బులి పెనఁగ నిట్లు
జరగె వాదము వారికి చాలసేపు.
అంత ఖేచరు లద్భుత మంది, గోవు
సత్యవాకుృద్ధి, పులికృపాసక్త బుద్ధి
చాల మెచ్చుచు నంతరిక్షమున నుండి
కుసుమవర్తంబు వారిపై కురిసి రోగిని.
మొలను పులితోలు పచ్చడంబును ధరించి
నృషభ రాజంబుపై నెక్కి వేడు కలర
అంత నీశ్వరుఁ డచట ప్రత్యక్షమయ్యే
వ్యాఘ్ర ధేనూ త్తమంబుల వాద ముడుప.
ఇట్టు లవతరించిన యీశు నెదుటఁ గాంచి
వ్యాఘ్రమును గోవు భక్తి సంభ్రమము లెసఁగ
స్తుతు లొనర్చిరి, దాని కీశుండు మెచ్చి
కరుణతో నిచ్చెవారికి పరమపదము.
బుద్ధిచాలని మూర్ఖుని పుడమియందు
పశు వటంచును పిలుతు, రాపశువ కాదె
నిత్యసత్యవ్రతంబును నిర్వహించి
ప్రవిమలానందపదవిని బడయఁగలిగె.