ఈ పుట అచ్చుదిద్దబడ్డది
పాటి యున్నదె యెందైన పసరమునకు?
బేలనై దానిమాటల బెలువడితి
కేలఁ జిక్కి నయావులు గోలుపోతి
అకట! నావంటియంబేద యవనిఁ గలడె?
బళిర! తా నొక్క నిజమరిబలె నటించి
పెక్కు బాసలు చేసి తప్పించుకొనియె,
అయినఁ గానిమ్ము, ఇంతలో నైన దేమి?
ఎదురువడకున్నె యది యింక నెన్న డేని?
ఇంక నీ సారి అయ్యది యెదురుపడిన
ఒక్క పెట్టుక దాని పై నుఱికి, మేను
వ్రచ్చినందఱచేసి యావెచ్చనెత్రు
గ్రోలకుండిన నింక నే క్రొలుపులినె?
అంచు పెటపెట పండ్లు దీటించుకొంచు
కడిఁదియాఁకట కటకటబడుచునున్న
పులికుఱంగట నొయ్యన నిలిచె గోవు
చుక్క తెగి రాలిపడినట్లు చక్కవచ్చి.
ఇట్టు లరుదెంచి పులి చెంత నిట్టనిలిచి
ధేను విట్లనె (పులిఱేఁడ! నేను పోయి
ఎంతో తడ వయ్యె, అక్కటా! యింత సేపు
ఎటు లుంటివో యాఁకట బిట్టు దూలి?