ఈ పుట అచ్చుదిద్దబడ్డది
కొఱవిచేఁ గాల్చినట్టులు, సురియ బెట్టి
వ్రచ్చినట్టులు, కొఱ్ఱున గుచ్చినట్లు
ములుకులను బోలు తనతల్లిపలుకులు విని
గుండె లవియంగ నేలపైఁ గూలె దూడ.
అంబ యను, నన్ను వీడ నాయంబ యనును,
వనట ముంచితె చెనంటిదైవంబ! యనును,
ధరణి నాజీవ మింక వ్యర్ధంబ యనును,
అకట! పులి యేల దాపురం బయ్యె ననును-
అనుచు పలవించుతనయుని కనియె గోవు
జీవియై పుట్టుపిమ్మట చావు నిజము
ఉఱక చచ్చుటకంటెను పరులకొఱకు.
మరణ మొందుట పరమధర్మంబు గాదె?
అమలసత్యంబె యూఁతగా, వ్యాఘ్రవక్ర,
గహ్వరం బది మోక్షమార్గంబు గాఁగ
స్వర్గసుఖముల చూఱాడఁ జనుచునుంటి
అహహ! యింతటికంటె భాగ్యంబు కలదె?'
అనుచు నాత్మజశోకద వాగ్ని కీల
లాత్మవచనాంబువృష్టిచే నాఱఁజేసి
సత్వరంబున పులి యున్న చక్కి జేర
నరిగె గోరత్న, మంత నవ్వ్యాఘ్ర మచట.