ఈ పుట అచ్చుదిద్దబడ్డది
నూతిదరులందు లోతైన గోతులదరి
నెట్టి పచ్చిక మొలచిన మెట్టఁ జనకు,
గుమురుగా నున్న కసవుజొంపముల నేని
మూరుకొనకుండ నెన్నడు ముట్టఁ బోకు.
పోటుపస రాలజోలికిఁ బోకు మెపుడు
దుడుకుతోడు కులపొదుఁగుల దూటఁ బోకు
తెవులుగొం టులతోఁ గూడి తిరుగవలదు
మొసలి మసలెడు మడువుల మూతి నిడకు.'
నిన్ను బోయక చెంత నే నున యపుడె
ఒద్దికను నిన్ను ముద్దు సేయుదురు కాని,
అక్కటా! నేను నిను బాసి యరిగిసంత
లెక్కగొందురె ని న్నొక్క వక్క కైన?
తూడుకంటెను, పుప్పొడిధూళికంటె,
తృణకణముకంటె, పులుఁగులయీఁకకంటె
బెండు కంటెను, మఱి దూదిపింజకంటె
చల్క నగుఁ గాదె తల్లి లేనిసుతుఁడు జగతి.
స్వామి యెపు డైస కినుకచే నేమి యన్న
అల్క జెందక తలలోని నాల్క వగుచు
ఏను లేనట్టికొద గాననీక మెలఁగి
వెయ్యియేఁడులు నర్ధిల్లు మయ్యకొడుక!'