ఈ పుట అచ్చుదిద్దబడ్డది
వనధిలో తెంతో యెన్నంగ వచ్చుఁ గాని
తల్లిదయలోతు నెన్నంగఁ దరము కాదు.
మాతృప్రేమకు సాటి యీధాత్రిఁ గలదె?
పోయి రావమ్మ వేగ నోపూజ్యురాల!'
అనుడు పులికి ప్రదక్షిణ మాచరించి
కనుల నానంద బాష్పముల్ క్రమ్ముకొనఁగ
అరిగె పరుగున ధేను 'నంబా' యటంచు
పొదుఁగువ్రేగున తడఁబడ పదచయంబు.
ఆసుధామధురథ్వని యాలకించి
వత్స ' మంబే' యటంచును పఱుగు వాఱి
మాతకడ కేగి పొదిక్రింద మూతి దూర్చి
గుప్పుగుప్పున దుగ్గముల్ గుడిచికొనియె.
ముట్టెతోఁ గుమ్మి పొదుగుపై పొడిచి పొడిచి
కొడుకు పాల్ ద్రావుచున్నంతతడవు తల్లి
అట్టు,నిట్లును మెదలక యట్టె నిలిచె
తెల్ల రాతిని మలచిన ధేను వనఁగ.
అంత నాయింటియిల్లాలు చెంత కరిగి
బిందె చేకొని పొందిక్రిందఁ బెట్టి నిలువ
ఉఱు దాయియు లేకయె ముఱు బాలు
కురిసె సంతతధారగా పొరలిపాఱ.