Jump to content

పుట:Go Geethamu.pdf/12

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

విడిచినంతన బ్రతుకు జీవుఁడయటంచు
సరగ తనయునికడ కేగి చన్ను గుడిపి
కాంక్ష మీఱఁగ నుందువు గాక, యకట!
తిరిగి వత్తువె యిచ్చటి కెఱిఁగి యెఱిఁగి?

బ్రదికియుండిన శుభములు బడయవచ్చు
తఱకలును చొప్ప చాలును, మఱచి యైన
తలపొలము వీడి యడు గైన దాట' నంచు
తలఁచెదవు కాని నామాట తలఁతు వొక్కొ?

మహితవిజ్ఞానయుతు లైన మనుజులం దె
మాట తప్పంగ నేరని మానధనులు
కానరా రన్న, మాటికి గడ్డి కఱచు
పసరములమాట వేఱ చెప్పంగ నేల?

ఆఁకటను ప్రేగు నకనకలాడుచుండె
ఇట్టు న న్నింక నఱ్ఱాఁక వెట్టఁ దగునె?
తడవు సేయంగ నేటికి? తనివి దీఱ
నంజుకొనియెద నీ మేనినంజు డెల్ల.

ఇట్టు లేమిటి కింకను నెట్టుకొనెదు?
నీదుకఱుదుల నాకుక్షి నిండుకొనునె?
బిడ్డపై జడ్డు విడలేక పెనంగె దౌర!
ప్రిదులవచ్చునె నాముందు వెఱ్ఱిగొవ?