Jump to content

పుట:Go Geethamu.pdf/10

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

తువ్వ కాదది తేనియగవ్వ గాని
గవ్వ కా దది నును వెండిమువ్వ గాని
మువ్వ కా దది తెలిమల్లెపువ్వు గాని
పువ్వు కాదది జిగి వెన్న ముద్ద గాని,

పాలు గుడిపితి తెల తెల్లవాఱు వేళ
ఇంతలో నందునిందుకు గంతులిడఁగ
అకట! ఆపాలు పుడిసెడు సఱిగిపోవ
తూలుచున్నాఁవొఁ యాకట సొలి కొడుకు:

వీఁకమై నేను తకమేను నాఁకుచుండ
తోఁక పై కెత్తి వీనుల దోరవైచి
కన్ను లఱమోడ్చి సొక్కు, నాచిన్ని కూన
కెవరు ది క్కొకొ యెక్కటా! యింకమీఁద?

నన్ను గానక నెమరి కాకన్న కొడుకు
దారి నేగొడ్డుటా వైనఁ దారసిలిన
పొదుఁగు తొనకంగ, సయ్యది యువరిపడుచు.
కొమ్ముచేఁ గ్రుమ్మి చిమ్మునో కుదికిలఁబడ?

కుక్షి నిండును గుక్కె డుగుమ్మపాల
నాదుసుతునకు, నా మేనిసంజు డెల్ల
తనివి దీఱఁగ నారగించినను గాని
ఉడుగ దించుకయేని నీకడుపుచిచ్చు.