పుట:Geethamulu, basavaraju apparao (1934).pdf/91

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది


నాట్యసుందరి

ఆడవె, ఆడవె
అన్నులమిన్నా
ఆడవె లేనడు
మల్లలనాడన్‌
ఆడెడు నీ నడుమందము గాంచిన
నల్లాడవె ప్రేమను లోకంబుల్‌? ||ఆడవె||

పాడవె, పాడవె
భామామణిరో
పాటలాధరము
బాగులు గుల్కక
వలపు జిల్కు నీ పాటలు విన్నన్‌
పరవశగాదే ప్రకృతి యెల్లన్‌? ||పాడవె||

చూడవె, చూడవె
సుందరవదనా!
సోగకన్నులన్‌
సోలగ ప్రేమము
సొంపు గుల్కు నిన్‌ జూచినంతనే
చుక్కలు సైతము సోలవె ప్రేమన్‌? ||చూడవె||