పుట:Geethamulu, basavaraju apparao (1934).pdf/36

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది


నీటి బుగ్గలు

        జీవమా! చెలి నీకై సృజింప బడెనె
        అట్టిదానిని నీ వెట్టు లవల ద్రోతు?
        ధనము ఘన మొకొ? సౌఖ్యసాధనము ఘనమొ
        చిత్తమా ! నీవె యోచించి చెప్పరాదె!

        చెలియయున్ జక్కదనమున చిన్నవోదు,
        తెలివి గలది సద్గుణశీల, దీప మౌను
        నాదు గృహమున కట్టి యా నాతి విడువ
        చిత్తమా! యెట్లు యోచన జేసితీవు?

        చెట్టబట్టెదుగా వేరు చెలి నెవతెనొ
        అల్ల యా నాతి మంచి దౌనంచు నీకు
        నమ్మక మదేమి? బ్రతికినన్నాళ్లు కష్ట
        కూపమున మున్గి చచ్చిపోగోరుకొనెదె?

        చేత నున్నట్టి దనమును జేతులార
        పారవేయునె యెంత నిర్భాగ్యుడైన?
        నీటిబుగ్గల నమ్ముకు నేటదుముక
        కొట్టుకొనిపోవె, యో వెర్రి కుట్టి మనమ?