ఈ పుట ఆమోదించబడ్డది
...............?
నోరు విడబడు తున్నదయ్యా,
గొంతులో,
జీర తెగిపోతున్నదయ్యా!
మాట లిపుడిపుడేను
నోట పడుతున్నాను,
పాట లేమైనాను
పాడగలనేమోను! ||నోరు||
మూగనయ్యే నంచు
రాగమే రాదంచు
యేగతౌనో, యంచు
నెంతొ దిగులాయెగా! ||నోరు||
పుట్టినందుకు ఫలము
పొందగల నేమోను
అచ్ఛారె! యని నీవె
మెచ్చగల వేమోను!
నోరువిడబడుతున్నదయ్యా,
గొంతులో
జీర తెగిపోతున్నదయ్యా!