పుట:Geethamulu, basavaraju apparao (1934).pdf/212

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

                  తెలియు మాత్మను ఆత్మను కలిపి కుట్టు
                  దారమే నాదు ప్రేమకు గారణమ్ము.


సహజలావణ్యము

(సెలయేటిగానము నుండి)

                మోముతీరు సామాన్యమే, ముగుద, కురులు
                ముడిచి, కుంకుమతిలకమ్ము మోమున నిడి
                నంతనే యింత సొగ సెట్టు లబ్బె, జెప్ప
                వే చెలి, వినంగ నామది వేడ్కవుట్టె.

                తీగెదీపమ్ము దీప్తి నల్దెసల బర్వి
                చదల చీకటి నిటు నటు కదలబాఱ
                జేయుచుండ, నొయారమ్ము చెలగ నిలిచి
                మాటలాడెడి నీసౌరు మనము గొనియె
                చెలియరో! దేవలోకమ్ము చెడెల వగు
                లోపమేలేని యుత్తమరూపములను
                గంటిగాని, యదేమొ నా కన్నులకును
                నీదుమూర్తియె మోదమ్ము నించె, నిజము.

                ఉత్తమాకృతి జీవసంపత్తి గలుగు
                సహజలావణ్యమున కెట్లు సాటివచ్చు?