అంగడిలో అన్నీ యుంటే అల్లుడినోట శనన్నట్లు
భాగ్యరాశి భారతభూమి పరదేశపు సరకులేల? ||సి||
బాపూజీ - మాబాస్
పోర్ బందర్ కోమటింట పుట్టినాడోయ్
పురుషోత్తముడు జగతి మెట్టినాడోయ్
కొత్త యేసు క్రీస్తు అవతరించినాడోయ్
కొట్టకె పగవాళ్ళపొగరు దించినాడోయ్
పోర్బందర్||
హిందూపైగంబర్ జన్మించినాడోయ్
అల్లాహో అక్బరంటు అరచినాడోయ్
పోర్ బందర్||
చీమను సింహాసన మెక్కించినాడోయ్
రాతి నాతి జేసిన శ్రీరాముడేనోయ్
పోర్ బందర్||
ధర్మముకై ప్రాణి పందెమొడ్డినాడోయ్
తాళలేక శత్రువులూ తలకిందై రోయ్
పోర్ బందర్||