పుట:Geethamulu, basavaraju apparao (1934).pdf/21

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

హెచ్చరిక

      మంచిరోజు కాదోయి, చందమామా !
      మంచిదారి కాదోయి, చందమామా !

          ఇంద్రధనసు విమానాన
          చందమామ! యెచటికంత
          తొందరగా బొయ్యేవోయ్
          ముందు కీడు తెలియదేమొ!

               మంచిరోజు కాదోయి చందమామా !
               మంచిదారి కాదోయి చందమామా !

          కవిలా గున్నావు నీకు
          కానరాదొ కిందు మీదు ?
          *[1] మిత్తిలా తమస్సు నిన్ను
          మింగి గుటక వేసేనోయ్

               మంచిరోజు కాదోయి చందమామా !
               మంచిదారి కాదోయి చందమామా !

  1. మిఠాయిలా తమసు