ఈ పుట అచ్చుదిద్దబడ్డది
ధన్యత జెందీ ముక్తిని బొందే
తరుణము దొరికెను మరి రాదండోయ్
వేణునాదము మోగుతుందండోయ్
ఓభక్తులారా!
వేణునాదము మోగుతుందండోయ్
"మత్తుమందు"
ఎవరేశారీ మత్తుమందు,
ఎన్నాళ్లదాకాను, ఈమొద్దునిద్దర ||ఎవరే||
నల్లమందైతేను, నాలుగ్గడియలవరకె
కల్లు మత్తైతే పధి, గడియలవరకేను ||ఎవరే||
తాచువిషము కూడ, తగ్గేను మంత్రముతో
ఏదివ్యమంత్రముతో, యీమత్తు తగ్గేనో ||ఎవరే||
గాంధీమహాత్ముడు, కనిపెట్టినట్టి యీ
సత్యాగ్రహమంత్రముతో, మత్తు వదిలేనేమో
ఎవరేశా రీమత్తుమందూ
ఎన్నాళ్లదాకాను యీ మొద్దునిద్దర? ||ఎవరే||