ఈ పుట అచ్చుదిద్దబడ్డది
"వేణునాదము"
వేణునాదము మోగుతుందండోయ్
ఓభక్తులారా
వేణునాదము మోగుతుందండోయ్ ||వేణు||
వేగుజామూ కోడికూసె
వేగుచుక్కా తూర్పున బొడిచె
వేగమె నిద్దురలేచి రండోయ్
వేళ మించీపోయేనండోయ్ ||వేణు||
భారతదేశపు దాస్యము బాపగ
పయన మాయె మోహనగాంధీ,
చావో జయమో తేలందే యీ
జన్మకు మళ్ళీ కనబడడండోయ్ ||వేణు||
భార్యల విడిచీ భర్తలు రండోయ్
భర్తల విడిచీ భార్యలురండోయ్
తల్లుల విడిచీ పిల్లలు రండోయ్
పిల్లల విడిచీ తల్లులు రండోయ్ ||వేణు||
పాపాలన్నీ పటాపంచలై
పరమేశ్వరుసన్నిధిలో జన్మము