పుట:Geethamulu, basavaraju apparao (1934).pdf/201

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


అహో, యెంత చిత్రమైన
     దగును నాదు చేతముతీ
రపరమేమె తోచదయ్యె
     నతివమిన్న! నీవుదక్క!
నీవే! నీవే! నీవే!
అఖిలజగతియం దీ య
    ద్వైతభావ మెట్టిదియో!
                ----
                మాగాంధీ

కొల్లాయి గట్టితే నేమీ,
          మాగాంధీ,
కోమటై పుట్తితే నెమీ! ||కొల్లాయి||
    వెన్నపూసా మనసు
    కన్నతల్లీప్రేమ
    పండంటిమోముపై
    బ్రహ్మ తేజస్సు ||కొల్లాయి||