ఈ పుట అచ్చుదిద్దబడ్డది
విరహము
ఏడ తిరుగాడెదవు కృష్ణా!
ఈ
వాడ్కే రావైతి కృష్ణా!
నీపైని మోహమున కృష్ణా!
నే
నిలువలేకుంటినా కృష్ణా!
కాల్చుచున్నది జ్వరము కృష్ణా!
నా
కాలుచేతులు వదకు కృష్ణా!
ఆన లడుగంటెరా కృష్ణా!
ఆ
యానమున బల ముడిగె కృష్ణా!
బాలభానునియట్ల కృష్ణా!
నీవు
వచ్చి న న్నలరింపు కృష్ణా!
వదనకాంత్రుల జిమ్మి కృష్ణా!
నా
పరితాన మార్చగా కృష్ణా?