పుట:Geethamulu, basavaraju apparao (1934).pdf/194

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


           అవతారసమాప్తి

నీవు నెమ్మది నుంటి వేముంది చెప్ప?
నీవు మరణము నొంది తేముంది చేయ?
నీయాత్మ యా పరమేశుసన్నిధిని
జేరె నింకేముంది నేరుచుకొప్నగ!
నీ వంత మొందనాకీజీవ మేల?
అర్ధమ్ము లేని వైభవము కీర్తియంచు
కలిసి ముచ్చటలాడు చెలికాడు లేక
వేచి చూడందగు విభునీడ లేక
                  -----
               బాలకృష్ణుడు

బంగారు పుష్పమ్మువలె ముద్దుగులుకు
చిన్నారి పొన్నారి చిట్టి నాతండ్రి
సకలసంపదలైన స్వారాజ్యమైన
నాచిన్ని కృష్ణుకన్నను నెక్కువౌనె?