పుట:Geethamulu, basavaraju apparao (1934).pdf/193

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


         భావాచింతనము

కాలచక్రము గతిగడచి, ప్రపంచ
భావిభాగ్య మ్మెల్ల వండినవెనక
నానాటి కెవరైన నడుగకపోరు
'శ్రీకృష్ణు డెవ్వరు చెప్పుమా? యంచు
భాగ్యవశమ్మున భావికాలాన
నమృతతుల్యములు జీవిత భారనంర
ములు నైన నాగీతములు విని రాధ
ప్రేమ మగాధ మం చెఱుగకపోదు.
            ------------
            ప్రేమమాయ

కల్ల గాదిది నమ్మగా దగు సకియ!
నంగెడు బంగారు వరిపైరువోలె
జలజల ప్రవహించు జలములవోలె
వనిత నాహృదయమ్ము పడిలేచుదుండె.
అదృశ్యమై వచ్చు నాతినిశక్తి
వారెధినుండి ప్రచండవాయువుబోలె,
ఆతని దూరాన నరసిన యంత
కారణమ్మును నెఱుంగకయె ంరొక్కెదను.