పుట:Geethamulu, basavaraju apparao (1934).pdf/190

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


            జీవితరహస్యము

ఈజీవితమ్మున కేమర్ధ మోయి
నామనోహర! ప్రియా! నారాజ! చెపుమ,
శరదంపు సూర్యునికిరణాలు నీదు
బంగారుశిరముపై అర్వియుండంగ.
చాందీతళుక్కుల సంజల వీదు
విమలస్వరం బిట్లు వినుపించుచుండ
మనుజుల కనుబ్రామి మాయమై చనిన
ప్రకృతిదౌ పరమరాహస్యమ్మదేమి?
                 -----
             అదృష్టము

భాగ్య మ్మది యనేక భంగుల మాఱు
సంద్రంపు తరగలచందంబు దోవ
కాన నెమ్మది తెల్వి గల్గియున్నపుడె
పానమ్ము జేయు మావల నేమి య్హౌనొ!