పుట:Geethamulu, basavaraju apparao (1934).pdf/188

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

చెట్టు; చామ నల్లబాఱె
పిట్టలన్ని గూళ్ల కేగు
చుట్టు నెల్లయెడలను చీ
   కట్లు గ్రమ్మెడున్."
"మొన్న తోట గంటి మ్నొక్క
వన్నెకాని కామరూపు
కన్నుమణగుకాంతి, వాలు
     గన్నులవానిన్.
తల కొక పూదండయు, చే
తులకు కంకణములు దెచ్చి
వలపు కలిగనటుల మెల్ల
       కిలకిల కులికెన్.
ఎక్కించెను తేజీపై
నొక్కటైన గాంచ నతడు
పక్క కొఱిగి, యీల వేసి
    చక్కగ బాడన్.
మలగుపండ్లు గుడ్వ నిచ్చి
పలవదేనె మంచుపాలు,
తెలిఅనట్టి బాస జెప్పె
           'వలతు ని ' న్నవి