పుట:Geethamulu, basavaraju apparao (1934).pdf/187

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


చెవ్వికింపగు నాదముతో నెలయేఱులు శ్రుతి వేయగ
చివురుటాకుబోలు వ్రేళ్ళ చెలియ ! నీవు వీణె మీట,
నొక్కి జంతుజాలము విన, సొదల సన్ని పాఱదోలి
చేత నున్న విమలభావగీరపు పొత్తమ్మువిప్పి
శ్రవణసేయ ప్రణయగీరి చవులూరగ నేను బాడ
కానన మే స్వర్గసీమకన్న సౌఖ్య మౌగదె! యీ
లోకముఇతో మన కేటికి, లోలాక్షీ! రా పోదము.
                           --------
                  కామాసుర

"జలజల మని పాఱెడు నీ
సెలయేటిదరిం గూర్చుని
విలపించెద వేల నిటుల
     చెలియ! చెప్పవే.
చిన్నవోయె ముద్దుమోము
కన్నులంట నీరు గరు
వన్నెతరిగి వాడె మేను
     కన్నె! యేలనే?