పుట:Geethamulu, basavaraju apparao (1934).pdf/186

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


సకియ లిచటి కొచ్చినంత
నొకరిమొగము లొకదు చూచి
కులుకుచు చిరునవ్వు నవ్వు
           కొందు రేలనో ?
చెకచెకమని నడచెడు నా చెలుల నడకలోన నవ్వు
చెట్లచాటున నున్న పురుషుచిత్తమును కలంచుగాదె
           నీళ్ళకోస మప్ప చె
          ల్లెళ్లు పోదు రీ దారినె
                         ------
                   ప్రేమ రాజ్యము
                     (Adaption.)
లోకముతో మన కేటికి లోలాక్షీ! రా, పోదము !
జీవితంపు సంతసమ్ము జెరిప్ నంత గూర్చుపాదు
లోకముతో మనకేటికి, లోలాక్షీ, రా, పోదము.
సరసమౌ వసంతభాగ్యగరిమ మిగుల సుల్లసిల్లు
నడవులందు పండుఫలము గుడిచి మనము తనివిదీర
విచ్చినమందారపూల యచ్చమైన తేనె గ్రోలి
మచ్చమైకమొంది మేను మరిచిపోయి తమకమ్మున