పుట:Geethamulu, basavaraju apparao (1934).pdf/185

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట అచ్చుదిద్దబడ్డది           అప్ప చెల్లెళ్లు
  (రవీంద్రుని "తోటమాలి" నుండి)

నీళ్లకోస మప్ప చె
ల్లెళ్లు పోదు రీ దారినె
పువ్వుబోం డ్లిచటి కొచ్చి
నవ్వుకొందు రేలనో ?
చెలులు నీళ్ల్ కేగునపుడు చెట్లచటు నక్కిచూచు
సర్సు డున్న సంగరి వారెఱుగుదు రేమో ||నీళ్ళ||
ఈదారిని బోవునప్పు
డేదో గుసగుసలాడెద
రిద్దరు, నా సరసుని గు
ట్టెరుగుదు రేమో! ||నీళ్ళ||
సుందరు లిట కొచ్చినంత
బిందె లిటులు నటు లొరుగుచు
చిందిపోవు లోని నీ
ళ్లెందుచేతనో?
చెలులు నీళ్ళకేగునపుడు చెట్లచటు నక్కిచూచు
పు;రుషు గుండెతల్ల వా రెఱుగుదురేమో? ||నీళ్ల||