పుట:Geethamulu, basavaraju apparao (1934).pdf/183

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

బ్రాహ్మణుం డా దేవి వదలి నా మోము
జూచి నాచెలువున జొక్కెడునేమొ ?
కన్నుల కేరికి గానరాకుండ
పొదరింటిలో బలె పుష్పగర్భమున
దాగియుండెడు సుగంధంబును బోలి
మద్రచితమ్ములౌ పద్యాల నడ్గి
యున్న నామోము గాంతురుగాక జనులు
మేలిముసుంగు నే నేల దీయవలె ?
           ----------------
                  నిరాశ
               (జేబున్నీసా)
అల పాలసమ్ములౌ హస్తమ్ములార !
ప్రాణేశు కౌగిలి బడయరైతిరిగ !
శుష్కించి యీరీతి జొక్కుటకన్న
విరిగిఓవుటయే మే లరసిచూడంగ.
దండుగమారి నేత్రములార! మీరు
కాంతుని న్నేండ్లుగ గానరైతిరిగ !