పుట:Geethamulu, basavaraju apparao (1934).pdf/177

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట అచ్చుదిద్దబడ్డది          వలపులజోల
         (శాఫోగీతము)

నిద్దుర బోవే, ఓ చెలియా
నీవలపుంబ్రియ కౌగిలిలో
మోటకాల్వయందున జీవజల
మ్ములు గుసగుసలాడుచు బోవన్
మిణుగురు పురువులు వెన్నెల నిటు నటు
మిణుకు మిణుకు మని మెఱయంగన్
నిద్దురబోవే ఓ చెలియా
నీ వలపుంబ్రియు కౌకిలిలో,

త్రుటిసౌఖ్యమె, కట్టా, త్వరలోనె
పిట్టలు లజ్జారవముల గూయున్,
బాలభాస్కరుడు వనవృక్షమ్ముల
పై వెలుగ నిదే వచ్చును కనుమీ,
మానవసౌఖ్యమ్ముల కెల్లన్ పరి
మాణము గలదు గదే ఓ చెలియా ?
నిద్దురలోనే ఓ చెలియా !
నీ వలపుంబ్రియు కౌగిలిలో.