పుట:Geethamulu, basavaraju apparao (1934).pdf/170

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

నూజవీటిపోతుగడ్డ

(వాయుసందేశమునుండి)

అడవిమార్గమ్ము లన్నింటి గడచి కడచి,
శర్వరీసార్వభౌము డపూర్వకీర్తి
వైభవోపేతు డౌచు చేల్వందుచుండ,
శుభ్రవున్ జ్యోత్స్న లవనిపై సుప్తి జెంద
గగనతలమున దూరాన గానిపించు
రజత శైలాగ్రసదృశవిరాజమాన
రాజహర్మ్యగ్రతలములు రాణువొప్పు
నప్పరాయనరేంద్రుల యాటపట్లు !
చుల్కనగ జూడబోయెదు సుమ్ము, మున్ను\
మేకపిల్ల తోడేలితో మించి పోరి
నట్టి మేల్పోతుగడ్డ మా పట్టణమ్ము,
ప్రధితవీరావతంసులవాస మయ్యు,
తల్లి మాకోటమహిష మ్మదయ తొలంగ,
వేణుగోపాలు డ;ల్కమై వీడి చనగ,
పతియు బందుగులున్ వీడధృతి తొలంగి
వేఱుచందమై తోచెడు వెలదివోలె,
పూర్వవిభవచిహ్నమ్ములౌ బురుజు లెల్ల