పుట:Geethamulu, basavaraju apparao (1934).pdf/169

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


కాలువలు నల్గడల నలంకారములుగ
జెలగ, జలయంత్రనిర్గత జలకణాళి
మౌక్తికాహారభూషిత మందిరాంగ
ణోల్లవత్ పుష్పవల్లుల నొప్పుపుకము !
వారకాంతలు నివసించు వాడలందు\
గాన వృత్తానుకర మృదంగములదైన
స్నిగ్ధగ్ంభీర ఘోషము చెవులబడిన్
తోడనే మేఘరవమంచు దోచు నీకు !
భాగ్యవంతులు మేడల పాంపులందు
మందమతులట్లు పొరలాడుచుందు రకట !
అన్నమో రామచంద్రా యటంచు నేండ
నేడ్చు బీదవానికి నిల్వనీడలేదు !
కాంచుమా కృష్ణవేణీ, దుర్గాంబ పైడి
ముక్కపో గందుకొన పంత మూని వేగ
వచ్చు నాటోపముగ పరవళ్ళతోడ
చెంగలించుచు నార్చుచు భంగపడుచు !
ఇంద్రకీలాద్రి కాసింత సందు నీయ
కృష్ణవేణీ మోమోట మింతేని లేక
చీల్చి భేదించి ప్రవహించు చెచ్చెర నదె
చనువునిచ్చిన నెక్కెను చంక కనగ.