పుట:Geethamulu, basavaraju apparao (1934).pdf/167

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ఇంద్రకీలాద్రి

(వాయుసందేశమునుండి)

అల్లదే ఇంద్రకీలాద్రి, ఆకసమ్ము
పై కెగయబ్రాకు, నల్ల యా ప్రాతదుడిసె
పార్ధు డా శైలశిఖరాన పాశుపతము
బడయ శివుని గూర్చి ఘోరతపమ్ము జేసె!

కార్యశూరతి దక్కి నిర్వీద్యు లౌచు
కన్నభూమాతకును కళంకమ్ము గూర్చు
పరమనాస్తికు లిపుడు తప: ప్రభావ
మెల్ల బూటకమంచు నిందింతు రకట !
ఆ నగోత్తమమున కధిష్ఠాన దేవి
కనకదుర్గాభవాని లోకాలతల్లి
తొల్లి తన యుగ్రశక్తుల నెల్ల నొక్క
బాలసన్న్యాసి ఘనతపోబలముకతన
గోలు పడి, యొంటి నివ్సింప దాళలేక
స్త్రీజనోచిత కోమలప్రేమ చకిత
చిత్తయై, మొన్న మొన్ననే చెంత జేర
విభుని మల్లికార్జునని రప్పించుకొనియె !